ETV Bharat / state

హుజూర్​నగర్​లో వాహనదారులకు కౌన్సిలింగ్​

జనతాకర్ఫ్యూలో అందరూ ఇంటికే పరిమితమైతే... వారు మాత్రం నిర్మానుష్య రోడ్లపై వాహనాలతో దూసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని పట్టుకుని కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

Councelling To Motorists
Councelling To Motorists
author img

By

Published : Mar 23, 2020, 11:13 AM IST

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో అందరూ స్వీయ నిర్బంధంలో ఉంటే... సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో మాత్రం కొందరు మాకేమీ కాదన్న విధంగా రోడ్లపై వాహనాలతో విహరించారు. రహదారులపైకి వచ్చిన వాహనదారులను పట్టుకుని స్థానిక సీఐ రాఘవరావు వారికి కౌన్సిలింగ్​ ఇచ్చారు.

జనతా కర్ఫ్యూ కారణంగా ఎలాంటి వాహనాలు రోడ్లపైకి రాకూడదని... దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూతో పట్టణమంతా బోసిపోగా... తహసీల్దార్ జయశ్రీ, మండల వైద్యాధికారి లక్ష్మణ్, హుజూర్​నగర్ ఎస్సై అనిల్ రెడ్డి, మునిసిపల్ అధికారులు తమ సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తించారు.

హుజూర్​నగర్​లో వాహనదారులకు కౌన్సిలింగ్​

ఇదీ చూడండి : రైతు బజార్లు కిటకిట... ధరలు భగభగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.