సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. అందులో ముగ్గురు గరిడేపల్లి మండలకేంద్రానికి చెందగా.. జిల్లా కేంద్రంలో మరొకరు వైరస్ బారినపడ్డారు. గరిడేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో లక్షణాలు వెలుగుచూడగా.. ఆ ఇంటికి సంబంధించి మొత్తం ఐదుగురిని ఐసోలేషన్‌కు తరలించారు.హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న వ్యక్తితో పాటు అతని తండ్రి,19 నెలల కొడుక్కి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వీరికి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించేందుకు మూడు బృందాలు రంగంలోకి దిగాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు నెలల తర్వాత మానసనగర్ వాసిలో వ్యాధి నర్ధరణ కాగా పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 89 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇంకో 84 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జవగా.. తాజాగా వైరస్ బారిన పడిన నలుగురు మాత్రమే వైద్యం పొందుతున్నారు.
ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!