సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన మల్లారపు వెంకన్న-చైతన్యల రెండో కుమారుడు దీక్షత్. బుధవారం రాత్రి విషపురుగు కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడుకి చూపిస్తే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్థులు దీక్షిత్‌కి కరోనా సోకిందని పుకార్లు లేపారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని కాపాడుకోవడం కోసం తీవ్ర అవస్థలు పడుతూ ఉంటే గ్రామస్థుల మాటలు తామను మానసిక వేదనకు గురిచేస్తోన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానికులు విషయం తెలుసుకుని మనోధైర్యం కలిపిచాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండిః ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!