సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహించిన పరీక్షల్లో రోడ్డుపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఫోన్ కాల్ ద్వారా అతినికి వైరస్ సోకినట్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు. వారి ఇళ్లున్న వీధిలో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు.
మండల కేంద్రంలో పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా వారి దుకాణాలు మూసివేశారు.