ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కరోనా విజృంభణ

author img

By

Published : Apr 12, 2020, 8:42 AM IST

సూర్యాపేట జిల్లాలో మరో మూడు కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడటం ఫలితంగా జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య పన్నెండుకు చేరింది. యాదాద్రి భువనగిరి మినహా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో శనివారం వరకు 28 కేసులు నమోదయ్యాయి. ఒకే వ్యక్తి వల్ల ఏకంగా ఎనిమిది మందికి వైరస్ సోకడం... సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది.

corona
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కరోనా విజృంభణ

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. నల్గొండలో ఇప్పటికే 16 కేసలు నమోదు కాగా... సూర్యాపేట జిల్లాలో వాటి సంఖ్య 12కు చేరుకుంది. జిల్లా కేంద్రంతో పాటు తిరుమలగిరి, నేరేడుచర్ల మండల కేంద్రాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున శనివారం ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మూడు, నాగారం మండలం వర్ధమానుకోటలో ఆరు కేసులు బయటపడ్డాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజారుకు చెందిన వ్యక్తిలో కరోనా వెలుగుచూసింది. ఇదే వీధికి చెందిన వ్యక్తి రెండ్రోజుల క్రితం వైరస్ బారిన పడగా.. ఇప్పుడు ఆయన కుటుంబంలోనే మరొకరు బాధితుడిగా మారారు.

నేరేడుచర్లలోని రామాపురం వీధిలో ఒకరికి వైరస్ సోకింది. ఇతను మర్కజ్ వెళ్లొచ్చినట్లు గుర్తించి క్వారంటైన్​లో ఉంచారు. తొలిసారి పరీక్షల్లో ఈయనకు నెగెటివ్ వచ్చింది. రెండోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి మర్కజ్​కు వెళ్లి వచ్చిన వ్యక్తులకు భోజనం పెట్టినట్లు తేలింది.

సూర్యాపేట కుడకుడ వీధిలో ఉండే యువకుడు.. తన భార్యతోపాటు అత్తగారి కుటుంబంలో ఐదుగురికి వైరస్ సోకడానికి కారణమయ్యాడు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సామాజిక వ్యాప్తి చెందిన తీరు విస్మయానికి గురి చేసింది. తిరుమలగిరిలో పాజిటివ్ వ్యక్తితో కలిసిన 41 మందిని గుర్తించగా... వారందర్నీ క్వారంటైన్​కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

నేరేడుచర్లకులో పాజిటివ్ వచ్చిన వ్యక్తి సతీమణితోపాటు ఇంకో ఏడుగురిని సూర్యాపేటకు తరలించారు. ఔషధ దుకాణం నిర్వహిస్తూ మర్కజ్ వెళ్లి.. కరోనా బారిన పడిన 59 ఏళ్ల వ్యక్తి రెండుసార్లు క్వారంటైన్​లో గడిపారు. తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రాగా... మలి విడతలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్ పరీక్షల్ని అనుమతించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నల్గొండలో పారిశుద్ధ్య కార్మికులను, వైద్య సిబ్బందిని ఆయన సన్మానించారు. బత్తాయి, నిమ్మ రైతులను ఆదుకోవాలన్న ఆయన మినరల్ ఫండ్ ద్వారా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని దవాఖానాలను ఆధునికీకరించాలన్నారు.

ఇవీచూడండి: కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.