సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల కోలాహలం నెలకొంది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని 19 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రెండో రోజు 300 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజుతో కలిపి మొత్తం 337 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా నడిగూడెం నుంచి 46 నామినేషన్లు దాఖలు రాగా, అత్యల్పంగా రామచంద్రాపురం నుంచి ఒక్క నామినేషన్ వచ్చింది. రేపటితో నామపత్రాల దాఖలు గడువు ముగియనుంది.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'