కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఐఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్‌తో కలిసి ఆయన సూర్యాపేట జిల్లాలోని ఇందిరా భవన్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచనలు ఇస్తే.. తెరాస నాయకులు అపహాస్యం చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా చైతన్యమై సీఎం కేసిఆర్ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అసంఘటితరంగ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా టెస్టులు చేసి, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్, సుంకర శివరాం, కోలపూడి మోహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా