భారత్-చైనా సరిహద్దుల్లో గల్వాన్ ఘర్షణలో అమరుడైన సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో రూపుదిద్దుకుంటోంది.
పెనుమంట్ర మండలం గర్వు గ్రామానికి చెందిన ఏకే ఫైన్ ఆర్ట్స్ శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, కరుణాకర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు విగ్రహ తయారీ అవకాశం తమకు రావడం ఎంతో గర్వంగా ఉందని శిల్పులు పేర్కొన్నారు.
సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాకు కర్నల్ సంతోష్ బాబు పేరు పెట్టడంతో పాటు అక్కడే విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్