ETV Bharat / state

'రైతులను జీతగాల్లుగా చేసేందుకే సాగు చట్టాలు' - Telangana news

రైతులను ఆదానీ, అంబానీలకు బానిసలుగా చేసేందుకే కేంద్రం నల్ల చట్టాలు తెచ్చిందని కేంద్రాన్ని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎవరి ప్రయోజనాల కోసం నల్ల చట్టాలు తీసుకు వచ్చారని కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తెరాస చేసినట్టు డప్పుకొట్టుకుంటుందని ఆరోపించారు.

clp leader bhatti vikramarka meeting with farmers in suryapet district
'రైతులను జీతగాల్లుగా చేసేందుకే సాగు చట్టాలు'
author img

By

Published : Feb 20, 2021, 4:53 AM IST

Updated : Feb 20, 2021, 6:47 AM IST

పండిన పంటను కల్లాల్లోనే అమ్ముకునే రైతులు... ఎక్కడికోపోయి అమ్ముకోగలరా అని కేంద్రాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం నల్ల చట్టాలు తీసుకు వచ్చారని నిలదీశారు. సూర్యపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని రైతులతో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి భట్టి విక్రమార్క పొలం బాట పోరు బాట రైతులతో ముఖాముఖీ నిర్వహించారు.

బానిసలుగా చేసేందుకే..

రైతులను ఆదానీ, అంబానిలకు బానిసలుగా చేసేందుకే కేంద్రం నల్ల చట్టాలు తెచ్చిందని కేంద్రన్ని భట్టి విమర్శించారు. మిడ్​మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, కాకతీయ కాలువలు నిర్మించింది, నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తెరాస చేసినట్టు డప్పుకొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు.

కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు. డిండికి నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సాగర్​లో కేసీఆర్ మాట్లాడిన మాటలే మంథనిలో న్యాయ వాదుల హత్యలకు ప్రేరణ అయ్యాయని భట్టి అన్నారు.

'రైతులను జీతగాల్లుగా చేసేందుకే సాగు చట్టాలు'

ఇదీ చూడండి: వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు

Last Updated : Feb 20, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.