సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ తెరాస అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదైంది. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సైదిరెడ్డిపై కేసు దాఖలు చేశారు. అనుమతులు లేకుండానే ఎన్నికల ర్యాలీ నిర్వహించారని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే, లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె