తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మరో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. మొత్తం 80 నమూనాలను పరీక్షించగా... సూర్యాపేటలో ఇద్దరికి, తిరుమలగిరిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కేసుల సంఖ్య 23కు చేరింది.
ఈ ముగ్గురూ... ఇంతకుముందు బాధితుల వల్లే వైరస్ బారిన పడ్డారు. సూర్యాపేట పురపాలికలో 44 వార్డులకు గాను 15 వార్డుల్ని రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రాథమిక, రెండో దశ కాంటాక్ట్‌లకు సంబంధించిన వ్యక్తులందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. తిరుమలగిరి, నేరేడుచర్లలో పురపాలక సిబ్బంది ఇల్లిల్లూ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. మెుత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 595కు చేరింది.