ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఆరు గేదెెలు మృతి - విద్యుదాఘాతంతో ఆరు గేదెెలు మృతి

విద్యుదాఘాతంలో ఆరు గేదెలు మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో జరిగింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్​ తీగలు తెగడం వల్ల ప్రమాదం జరిగిందని.. ప్రభుత్వం ఈ విషయమై స్పందించి తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.

buffaloes died in due to current shock at nagaram village
విద్యుదాఘాతంతో ఆరు గేదెెలు మృతి
author img

By

Published : Jun 10, 2020, 5:42 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని వల్ల విద్యుత్​ తీగలు తగిలి... సుమారు రూ. 3 లక్షల విలువ చేసే ఆరు గేదెలు విద్యుదాఘాతంతో మరణించాయి. తమకు జీవనాధారమైన గేదెలు మృతి చెందగా... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు.

ప్రభుత్వం ఈ విషయంలో తూతూమంత్రంగా వ్యవహరించకుండా రైతులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని జడ్పీటీసీ కడియం ఇందిరా డిమాండ్​ చేశారు. మంగళవారం కురిసిన వానకు చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపడి పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వీఆర్వో తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.