ETV Bharat / state

గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం - bridge

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది సూర్యాపేట జిల్లా పోలేనిగూడెం గ్రామం వంతెన పరిస్థితి. వంతెన నిర్మాణానికి 1.98 కోట్లు రూపాయలు మూడేళ్ల క్రితమే విడుదలైనా వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 60శాతం పూర్తయిన వంతెన పనులను మధ్యలోనే వదిలేసి పోయారు కాంట్రాక్టర్లు. ఆ వంతెన పైనుంచి వెళ్లలేక మరోదారి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.

bridge works stopped in suryapet district
గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం
author img

By

Published : Feb 5, 2020, 6:38 PM IST

గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బరాఖత్ గూడెం నుంచి హుజూర్​ నగర్ మండలం రాయినిగూడెం వరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామం వంతెన పనులు మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. నిధులున్నప్పటికీ... గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

నాగార్జునసాగర్ ఎడమ కాలువనుంచి బేతావోలు వీర్లందేవి చెరువుకు నీరు వచ్చే కాలువపై వంతెన లోతు తక్కువగా ఉండి, రహదారిపై నుంచి నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం నూతన వంతెనకు ప్రభుత్వం నిధులిచ్చింది. గుత్తెదారులు కూడా వెంటనే పనులు ప్రారంభించారు.

రానురాను గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా నలభై శాతం పనులు మిగిలిపోయాయి. కాలువపై వంతెన నిర్మాణంలో కనీసం సైడ్​ వాల్స్​ను కూడా నిర్మించలేదు. గతంలో కాలువ ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. వంతెనపై ఆశలు వదులుకున్న గ్రామస్థులు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ మార్గము ద్వారానే ఖమ్మం నుంచి మిర్యాలగూడెంకు బొగ్గు రవాణా జరుగుతుంది. హుజూర్​నగర్, మిర్యాలగూడెం నుంచి సిమెంట్ రవాణా ఖమ్మంకు ఈ మార్గం గుండానే వాహనాలు వెళ్తుంటాయి. ఈ వంతెన పూర్తికాకపోవడం వల్ల వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

వంతెన నిర్మాణానికి వాడే కంకర, సిమెంట్, ఇసుక, ఇనుప చువ్వలు ఇష్టారీతిలో మాయమవుతూ... ప్రజా సొమ్ముకు గండిపడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తిస్థాయిలో వంతెనను అందుబాటులోకి తేవాలని గ్రామస్థులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.