ETV Bharat / state

ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు... ఒకరు మృతి

ఓ ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

పేలుడు
author img

By

Published : Sep 13, 2019, 12:40 PM IST

సూర్యాపేటలో జాతీయ రహదారికి సమీపంలోని వెంకట సాయి ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఇందులో పాత ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని ముక్కలుగా చేస్తారు. ఒక డబ్బాను మిషన్​తో కొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు దాటికి పరిశ్రమ షెడ్ రేకులు ఎగిరిపోయాయి. గోడ కూలిపోయింది. అందులో పనిచేసే కార్మికులు బయటికి పరుగులు తీశారు. ప్రమాదంలో మధ్య ప్రదేశ్​కు చెందిన రామచంద్ర సాహూ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పేలుడు గల కారణాలు పోలీసులు విచారిస్తున్నారు.

ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు... ఒకరు మృతి

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

Intro:SLUG :. TG_NLG_21_13_BLAST_IN_SURYAPET_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న పాత ప్లాస్టిక్ సేకరించి ఎగుమతి చేసే చిన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వాయిస్ ఓవర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన వెంకట సాయి ప్లాస్టిక్ చిన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. పాత ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని ముక్కలుగా చేసే ఈ పరిశ్రమలో ఒక డబ్బా ను మిషన్ తో కొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో 20 మంది కూలీలు పనిచేస్తుండగా... కోత మిషన్ వద్ద ముగ్గురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఏర్పడ్డ పేలుడు ధాటికి పరిశ్రమ షెడ్ రేకులు ఎగిరిపోయాయి. ఇదే ధాటికి పక్కనే ఉన్న గోడ కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో అందులో పనిచేసే కార్మికులు బయటికి పరుగులు తీశారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే దట్టమైన పొగ అచేతనంగా పడి ఉన్న కార్మికులను గుర్తించారు . ఈ ప్రమాదంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామచంద్ర సాహూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే రాష్ట్రానికి చెందిన సల్మాన్ షేక్ కన్నుకు గాయం కాగా మరో మహిళకు తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించదానికి గల కారణాలను పరిశీలిస్తున్న పోలీసులు డబ్బాను కొస్తున్న సమయంలో అంతకుముందు డబ్బాలో నిల్వ చేసి ఉన్న ఏదైనా రసాయనం లేదా. జిలెటిన్ స్టిక్స్ వంటి పేలుడు జరిగిఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైట్స్ ప్రత్యక్ష సాక్షులు

Body:....

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.