సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తెరాస నేతలు ప్రభుత్వం అండతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
అన్యాయం..
మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ అనుమతికి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో అసలైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. వారి అభిప్రాయం వినకుండా పోలీసులు, సెక్యూరిటీ అడ్డుకున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే అండ..
కంపెనీ యాజమాన్యానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అండగా ఉన్నారని అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇరు పార్టీల వారు ఆరోపణలు చేసుకున్నారు. భాజపా నేతలు ముడుపులు అందుకున్నారని తెరాస నాయకులు విమర్శంచారు.
దాంతో మేళ్ళచేరువు శివాలయంలో ప్రమాణం చేద్దామని, ఎమ్మెల్యే రావాలని భాగ్యరెడ్డి సవాల్ చేశాడు. ఈరోజు శివాలయం వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు భాగ్యరెడ్డి అరెస్టు చేసి... కోదాడ రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి