ETV Bharat / state

భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త - hospuital

సూర్యాపేట జిల్లాలోని చిల్పకుంట్ల గ్రామంలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త
author img

By

Published : May 18, 2019, 11:46 PM IST

భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త

భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్​కు చెందిన కల్యాణి, ప్రవీణ్ ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నారు. అప్పుడప్పడు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేవి. అవి కాస్తా తారా స్థాయికి చేరాయి.

2 నెలల క్రితం కల్యాణి సూర్యాపేటలో తల్లి గారింటికి వెళ్లింది. శనివారం ప్రవీణ్​ తమ్ముని కొడుకు అన్నప్రాశన కార్యక్రమానికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన ప్రవీణ్​ భార్య తలపై గొడ్డలితో నరికడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు సూర్యాపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల కల్యాణిని హైదరాబాద్​ తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ కుమార్ వెల్లడించారు.

ఇవీ చూడండి: కరెంట్ స్తంభంపై చచ్చిబతికాడు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
భార్య పై భర్త గొడ్డలితో దాడి పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు
సూర్యాపేట జిల్లా లో భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నూతనకల్ మండలం పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని చిల్పకుంట గ్రామానికి చెందిన ప్రవీణ్ సూర్యాపేట జిల్లాలో కేంద్రంలో అంబేద్కర్ నగర్ కు చెందిన కళ్యాణి ప్రవీణ్ ఇంటర్ చదువుతున్నపపటినుంచి ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలు వివాహానికి మొదట్లో అంగీకరించలేదు పెద్దను ఒప్పించి గత సంవత్సరం ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు . వివాహానంతరం బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వెళ్లి బిల్డింగ్ లకు పెయింటింగ్ పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పడు ప్రవీణ్ భార్య కళ్యాణ్ మధ్య గొడవలు వచ్చేవి అవి కాస్తా తారా స్థాయికి చేరాయి. సుమారు 2 నెలల క్రితం కళ్యాణి సూర్యాపేటలో తల్లి గారి ఇంటికి వెళ్లింది.
శనివారం ప్రవీణ్ తమ్ముని కొడుకు అన్నప్రాసన కార్యక్రమం కొరకు హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామమైన చిల్పకుంట గ్రామానికి చేరుకున్నాడు. అదేవిధంగా ప్రవీణ్ భార్య కళ్యాణి తల్లి గారి నుండి తాను కూడాగ్రామానికి చేరుకుంది .
అన్నప్రాసన కార్యక్రమం అయిపోయిన అనంతరం భార్య భర్తలు ఇద్దరు గొడవ పడ్డారు ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో గదిలోని గొడ్డలితో భార్య తలపై గట్టిగా కొట్టడంతో కళ్యాణి అపస్మారక స్థితిలోకి వెళ్లింది .గమనించిన బందువులు ప్రైవేట్ వాహనంలో సూర్యాపేటలో ని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు కళ్యాణి ని తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ కుమార్ తెలిపారు

Body:విజువల్స్ FTP లో పంపాను

Conclusion:వాడుకోండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.