సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పాత తహసీల్దార్ కార్యాలయంలో కుప్పలుగా బతుకమ్మ చీరలు పడేసి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడబిడ్డల కోసం ప్రతి సంవత్సరం దసరా పండుగకు మహిళలకు బతుకమ్మ చీరలను పంచి పెడుతున్నారు. ఈ చీరలను గత సంవత్సర కాలంగా మహిళలకు పంచకుండా ఒక గదిలో మూల పడేసి రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
హుజూర్ నగర్‌కు ఇటీవలి కాలంలో సబ్‌డివిజన్ వచ్చిందని ఆర్డీఓ కార్యాలయం కోసం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించగా పాత తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం నాడు డీఆర్డీఓ చంద్రయ్య పరిశీలించారు. ఈ క్రమంలో ఓ గదిలో మూటలు కట్టిన బస్తాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా బతుకమ్మ చీరలు దర్శనమిచ్చాయి.
ఇన్ని బతకమ్మ చీరలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని అధికారులను ప్రశ్నించగా గత సంవత్సరం 30 వేల చీరలు ఎక్కువగా వచ్చాయని మహిళలకు పంచగా మిగిలిపోయాయి అని అన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అందించే ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో అలసత్వం వహించి అవినీతికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య