ETV Bharat / state

భార్యపై కత్తిపీటతో దాడి చేసిన భర్త - దాడి

బోనాల పండుగకు పుట్టింటికొచ్చి భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆవేశానికి గురై కత్తిపీటతో దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

భార్యపై కత్తిపీటతో దాడి చేసిన భర్త
author img

By

Published : Aug 16, 2019, 8:49 AM IST

బోనాల పండుగకు వెళ్లిన భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన భర్తకు, భార్యకు మధ్య మాటామాటా పెరిగి భర్త సుధాకర్ భార్యపై కత్తిపీటతో దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి పరధిలోని గుగులోత్​తండాకు చెందిన గుగులోత్ శ్రీను కూతురు మహేశ్వరిని మోతే మండలం బల్లు తండాకు చెందిన భూక్య సుధాకర్​కిచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఒక కూతురు కూడా ఉంది. కొంతకాలంగా బతుకుదెరువు కోసం తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవలే పెద్దమనుషులు సర్దిచెప్పి పంపారు.

ఆదివారం బోనాల పండుగకు గ్రామానికి వచ్చిన మహేశ్వరిని తీసుకెళ్లడానికి భర్త సుధాకర్ వచ్చాడు. భర్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంలో సుధాకర్ పక్కనే ఉన్న కత్తిపీటతో మహేశ్వరిపై దాడి చేశాడు. అధికంగా రక్తస్రావం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

భార్యపై కత్తిపీటతో దాడి చేసిన భర్త

ఇదీ చూడండి : కృష్ణమ్మ పరవళ్లు... సాగర్​కు పోటెత్తిన సందర్శకులు...

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.

బోనాల పండుగ కు పుట్టింటికి వచ్చిన భార్యను తీసుకెళ్ళడానికి వచ్చిన భర్త ఆవేశానికి గురై కత్తిపీట తో దాడి చేసి ఘటన గురువారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పరిధిలోని మాచన పల్లి ఆవాస గ్రామమైన గుగులోత్ తండా లో జరిగింది.
పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుగులోత్ తండాకు చెందిన గుగులోత్ శ్రీను కూతురు మహేశ్వరి ని మోతే మండలం బల్లు తండాకు చెందిన భూక్య సుధాకర్ కిచ్చి రెండు సంవత్సరాల క్రితం వివాహం చేయగా వారికి ఒక కూతురు జన్మించింది. గత కొంత కాలంగా బ్రరతుకుదెరువు కోసం తరుచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవలే పెద్దమనుషులు ఇద్దరికి సర్ది చెప్పి అత్తవారింటికి పంపించారని తెలిపారు.
ఆదివారం గుగులోత్ తండాలో జరిగిన బోనాల పండుగ గ్రామానికి వచ్చిన మహేశ్వరిని పండగ అనంతరం తీసుకెళ్లడానికి వచ్చిన భర్త సుధాకర్ మహేశ్వరిల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది ఆవేశం సుధాకర్ పక్కనే ఉన్న కత్తిపీట తో మహేశ్వరి పై దాడి చేయగా తీవ్ర గాయాలపాలైంది అధికంగా రక్తస్రావం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సూర్యాపేట కు తరలించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ కుమార్ తెలిపారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.