నానాటికి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల నివారణకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట జిల్లా అనంతగిరిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహనా కార్యక్రమని నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని డీఎస్పీ రఘు పేర్కొన్నారు. జిల్లా నుంచి వచ్చిన కళాబృందంచే పాటలు పాడించి విద్యార్థుల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమం ద్వారా షీ టీమ్‌ని ఎలా వినియోగించుకోవాలో అర్థమైందని విద్యార్థులు తెలిపారు..
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!