మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వందరోజుల పని దినాలు కల్పిస్తున్నట్లు ఏపీడీ రాజు తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుక్కడం, పోలుమల్ల గ్రామపంచాయతీలో దస్త్రాలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం నాణ్యమైన మట్టిని ఉపయోగించాలని తెలిపిన ఆయన నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బిల్లులు రాలేదు
ఏపీడీ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చాడని తెలిసిన కూలీలు.. తాము గత సంవత్సరం చేసిన ఉపాధిహామీ బిల్లులు రాలేదని తెలిపారు. వారు కార్యాలయానికి వస్తే బిల్లు రాకపోవటానికి కారణాలు తెలుసుకుని .. వచ్చేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవీందర్, ఈసీ ముక్కంటి, టీఏ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి తేజ, పోలుమల్ల గ్రామ సర్పంచ్ చిలువేరి భవాని, కుక్కడం సర్పంచ్ గుండ్ల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.