సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నావరంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను గ్రామస్థులు సన్మానించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని 100 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.
కరోనా వంటి ఆపత్కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న ఆశా, అంగన్వాడీ వర్కర్లకు గ్రామ యువత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సభ్యులు వెంకన్న, మధు, ఉపేందర్ పాల్గొన్నారు.