ETV Bharat / state

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : 'వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం' - సూర్యాపేట జనగర్జన సభ

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

Amit Shah Speech At Suryapet
Amit Shah
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 5:36 PM IST

Updated : Oct 27, 2023, 7:55 PM IST

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా(Amit Shah) అన్నారు. సూర్యాపేటలోని బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌ షా.. బీఆర్ఎస్, కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్(Telangana Congress) లక్ష్యమని అమిత్​ షా ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తుంటారని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలని సోనియాగాంధీ(Sonia Gandhi) చూస్తుంటారని విమర్శించారు.

BJP Jana Garjana Sabha At Suryapet : కేసీఆర్, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యమని అమిత్ షా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్.. పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. కేసీఆర్‌ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా..? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న హామీ ఏమైందో కేసీఆర్‌ చెప్పాలని నిలదీశారు. రూ.50 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.

Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్​లో కాషాయ జెండా ఎగురుతుంది'

Amit Shah Jana Garjana Sabha At Suryapet : రూ.10 వేల కోట్లతో బీసీల సంక్షేమ కార్యక్రమాలు అన్నారని.. అవి ఏం చేశారో చెప్పాలని అమిత్ షా కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందని స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధికి కూడా బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. సమ్మక్క- సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.

'తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం. కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తుంటారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలని సోనియాగాంధీ చూస్తుంటారు. కేసీఆర్, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యం. బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. బీఆర్ఎస్.. పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ. కేసీఆర్‌ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న హామీ ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి. రూ.50 వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలి.' -అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

Amit Shah on Telangana Development : జల్‌ జీవన్ మిషన్‌ కింద గ్రామీణ పేదలకు మంచినీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని అమిత్​ షా చెప్పారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మించారని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్‌ రూ.15 లక్షల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 550 ఏళ్లుగా పోరాటం జరుగుతోందన్న ఆయన.. జనవరిలో ప్రారంభించే రామమందిరాన్ని ప్రజలంతా దర్శించుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అందరూ సంకల్పం తీసుకోవాలని కోరారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేస్తామని అందరూ సంకల్పం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Kishan Reddy Comments on BRS Government : తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2500 కిలోమీటర్ల రహదారులు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నారని.. అది సాధ్యం కాలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

Amit Shah at 75th Batch IPS Passing Out Parade : 'ప్రజాధికారాలను సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా.. త్వరలో నేర చట్టాల బిల్లుకు ఆమోదం'

Telangana BJP professionals and intellectuals Meet : 'బీజేపీ.. సిద్ధాంతాల పార్టీ.. బీఆర్​ఎస్​కు ఏం విధానం ఉంది?'

Last Updated : Oct 27, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.