సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో అఖిలపక్షం నేతలు ధర్నాకు దిగారు. మున్సిఫ్ కోర్టును తరలించొద్దని డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా తుంగతుర్తిలో నిర్వహిస్తోన్న కోర్టును అర్ధాంతరంగా తిరుమలగిరికి తరలించే ప్రయత్నాలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యాపారులు న్యాయవాదులతో కుమ్మక్కై కోర్టును తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ సామాజిక వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ ఆరోపించారు. న్యాయస్థానాన్ని తరలించే ప్రయత్నాలు మానుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింపజేశారు.
ఇవీ చూడండి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా