సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన ముంజల సైదులు గత నెల 24న బొలెరో వాహనం ఢీకొని అనుమానాస్పదంగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా... సంచలన విషయాలు బయటపడ్డాయి.
తాడ్వాయి వద్ద రోడ్డు ప్రమాదంలో సైదులు మరణాన్ని పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో సైదులును అతని సోదరుడు రమేశ్... బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపాడని తేలింది. బీమా డబ్బు కోసమే బాబాయ్ సైదులును రమేశ్ హత్య చేశాడని మునగాల సీఐ రమేశ్ నిర్ధరించారు. ఈ కేసులో రమేశ్‌తో పాటు అతని స్నేహితులు మహేశ్, శోభన్‌బాబులను అరెస్టు చేశారు.
" ముంజల రమేశ్ గతంలో 4 లారీలు కొనుగోలు చేశాడు. వచ్చిన డబ్బంతా జల్సాలకు తగలేసి నష్టాల పాలయ్యాడు. ఇటీవల మరో 2 లారీలు కొనుగోలు చేసి క్లీనర్‌గా ముంజల సైదులుకు పని కల్పించాడు. సైదులుతో రూ.50 లక్షల బీమా చేయించాడు. అతనికి ఎవరూ లేకపోవడం వల్ల... కొన్ని రోజుల తర్వాత సైదులును చంపేస్తే తనకు రూ.50 లక్షలు వస్తాయని పథకం రచించాడు. గతనెల 24న సైదులకు మద్యం తాగించిన రమేశ్... తాడ్వాయి వద్ద బొలెరో వాహనంతో సైదులును ఢీకొట్టి హత్య చేశాడు. తల్లీతండ్రి లేని క్లీనర్‌పై రూ.50లక్షల బీమా ఎలా ఉందనే కోణంలో దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది. "
- మునగాల సీఐ శివశంకర్ గౌడ్
- ఇదీ చూడండి : కేటీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేనా?