సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో ఘోర ప్రమాదం తప్పింది. మిషన్ భగీరథ లీకేజీ మరమ్మతుల కోసం తీసిన గుంతలో మూడేళ్ల బాలిక పడింది. గుర్తించిన స్థానికులు బాలికను కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల పేరుతో గుంతలు తవ్వి, వాటిని అలాగే వదిలేయడం వల్ల ఆ గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు కారణమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: శాంతి స్థాపనకు మహాత్ముడి మార్గమే శరణ్యం: మోదీ