ETV Bharat / state

కూరగాయల సాగులో స్వయం సమృద్ధి దిశగా అడుగులు..!

దళారుల బారినపడి మోసపోతున్న కూరగాయల రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా 8 గ్రామాలను డీఆర్​డీఏ అధికారులు ఎంపిక చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

author img

By

Published : Jul 8, 2019, 8:24 PM IST

vegetable
కూరగాయల సాగులో స్వయం సమృద్ధి దిశగా అడుగులు..!

కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ఫ్) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల నేతృత్వంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగించింది.

8జిల్లాలు ఎంపిక

కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా పండిస్తున్న గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. సూర్యాపేట, సిద్దిపేట, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఒక్క గ్రామంలో కూరగాయల సేకరణ చేపట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్​ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మండల స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సభ్యుడు వాటాధనంగా రూ.500, సభ్యత్వానికి మరో వంద రూపాయలు చెల్లించాలి.

సూర్యాపేటలో లక్ష్మీనాయక్ తండా ఎంపిక

సూర్యాపేట జిల్లాలోని అత్యధికంగా కూరగాయలు పండిస్తున్న చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో కూరగాయల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్​ తన ఇంటిని తాత్కాలికంగా ఇచ్చారు. ఈ గ్రామం పరిధిలో 12 తండాలున్నాయి. ఇక్కడి రైతులు సమీపంలోని సూర్యాపేట మార్కెట్​లో హోల్​సేల్ వ్యాపారులకు వారు అడిగిన ధరలకు ఇవ్వాల్సిన దుస్థితి ఉంది. లక్ష్మీనాయక్ తండాలో సుమారు 159 ఎకరాల్లో 161 మంది రైతులు కూరగాయల పంటలు పండిస్తున్నారు. తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లాభాలు పంచుతారు

రైతుల నుంచి సేకరించిన కూరగాయలను, ఆకుకూరలను సూపర్ మార్కెట్ సంస్థ రత్నదీప్​​తో సెర్ఫ్ ఒప్పందం చేసుకుంది. మోర్, హెరిటేజ్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కూడా ఇక్కడి కూరగాయలను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కంపెనీకి వచ్చే లాభాలను సభ్యులైన రైతులకు పంచుతారు. మొత్తానికి దళారుల బెడద తప్పడంతో పాటు విక్రయాలు లేక పారబోసే పరిస్థితి నుంచి రైతులకు ఊరట లభించనుంది.

ఇదీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

Intro:Slug :. TG_NLG_23_08_VILLAGE_VIGITABLES_PKG_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సూర్యాపేట.

( ) దళారుల బారినపడి మోసపోతున్న కూరగాయల రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చెందింది. రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 8 జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 8 గ్రామాలను ఎంపిక చేసుకున్న డీఆర్ డీఏ అధికారులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసే పనులను ముమ్మరం చేశారు. తరచుగా ముఖ్యమంత్రి నోటి నుంచి వినిపించే ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు ) కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది.

వాయిస్ ఓవర్ :

కూరగాయల ఉత్పత్తి లో స్వయం సమృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు రంగంలోకి దిగారు. కూరగాయల రైతులను ప్రోత్సాహించాలన్న కారణంతో అధికారులు కూరగాయల రైతులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో కూరగాయల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన మహిళా సంఘాల నేతృత్వంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగించింది. గ్రామీణ ప్రాంతంలో కూరగాయలు , ఆకుకూరలు ఎక్కువగా పండిస్తున్న గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. సూర్యాపేట , సిద్ధిపేట , అదిలాబాదు , ఆసిఫాబాద్ , వికారాబాద్ , రంగా రెడ్డి , మెదక్ , నాగర్ కర్నూలు జిల్లా లోని ఒక్కో మండలంలో ఒక్క గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని కూరగాయల సేకరణ చేపెట్టనున్నారు. ఇందులో అక్కడి రైతులు పండించిన కూరగాయలు ఆకుకూరలను తమ గ్రామంలో సొంతంగా విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. కూరగాయల సాగు చేస్తు వాటిని అమ్ముకునేందుకు పట్టణ ప్రాంతాలకు గంపలు చేతపట్టుకుని పరుగులు తీసే ఇబ్బంది తొలగనుంది. మహిళా సంఘాలతో కలిపి FPC ఫుడ్ ప్రాసెస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మండల స్థాయిలో రైతు ఉత్పత్తి దారుల కంపెనీలకు ఏర్పాటు చేస్తారు. గ్రామ స్థాయిలో VLPC (.విలేజ్ లెవల్ ప్రోక్యూర్ మెంట్ సెంటర్లు) సభ్యత్వాలు సర్కారిస్తున్నారు. ఒక్కో సభ్యుడు కంపెనీకి వాటధనంగా 500 రూపాయలు చెల్లించాల్సిఉంటుంది. ఇందులో సభ్యత్వానికి మరో వంద రూపాయలు చెల్లించాలి. రైతుల నుంచి సేకరించిన కూరగాయలను , ఆకుకూరలను రత్నదీప్ అనే సూపర్ మార్కెట్ తో సెర్ఫ్ ఒప్పందం చేసుకుంది. దీనితో పాటు మోర్ , హెరిటేజ్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కూడా ఇక్కడి కూరగాయలను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
రైతు సంఘాలతో ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఘడించే లాభాలను సభ్యులైన రైతులకు పంచుతారు. మొత్తానికి దళారుల బెడత తప్పడంతో పాటు విక్రయాలు లేక కిందపడబోసే పరిస్థితి నుంచి రైతులకు ఊరట లభించనుంది...

వాయిస్ ఓవర్ :

సూర్యపేట జిల్లాలోని అత్యధికంగా కూరగాయలు పండిస్తున్న చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండా లో కూరగాయల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కూరగాయల కొనుగోలు కేంద్రం కోసం ఈ గ్రామ సర్పంచి తన ఇంటిని తాత్కాలికంగా ఇచ్చారు. ఈ గ్రామం పరిధిలో 12 తండాలున్నాయి. అత్యధిక రైతులు కురాగాయల సాగు జీవనాధారంగా పంటలను పండిస్తున్నారు. ఇక్కడి రైతులు సమీపంలోని సుర్యాపేట మార్కెట్ లో హోల్ సేల్ వ్యాపారులకు వారు అడిగిన ధరలకు ఇవ్వాల్సిన దుస్థితి. లక్ష్మీ నాయక్ తండాలో సుమారు 159 ఎకరాల్లో 161 మంది రైతులు కూరగాయల పంటలు పండిస్తున్నారు. కొత్తగా ప్రారంభించే కొనుగోలు ద్వారా విక్రయాలు జరుపనున్నారు. ..బైట్

ఎండ్ వాయిస్ ఓవర్ ;

తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని కూరగాయల తోటల సాగు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

byte s

1. రాజయ్య , గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ మండల ప్రతినిధి.
2. వెంకన్న , మాజీ సర్పంచ్
3. సాలి , మహిళ రైతు.
4. నవీన్ , కూరగాయల తోట రైతు.

Body:...

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.