సూర్యాపేటకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు వెంకన్న హైదరాబాద్ కాచిగూడ రత్న నగర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు వీరేశం వద్దకు లాక్డౌన్ కంటే ముందు వచ్చి చిక్కుకుపోయాడు. లాక్డౌన్ కారణంగా సొంతూరుకు సూర్యాపేటకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపం చెందినట్లు కుమారుడు వీరేశం తెలిపాడు. ఒకటి రెండు సార్లు కుమారుడిని, మనవడిని అడిగిన పంపించలేదని.. ఇక వెళ్ళలేనేమో అని బెంగ పెట్టుకొని కుమారుడి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!