కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ.. రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠాయించడం వల్ల విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వ్యవసాయ చట్టాలకు, భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళాకారులు పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. దిల్లీ నడిబొడ్డున రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివిధ పార్టీలకు చెందిన రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జడ్పీ స్థాయి సంఘంలో రెండు పడక గదుల ఇళ్ల వివాదం