ETV Bharat / state

తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు

author img

By

Published : Apr 6, 2020, 1:26 PM IST

Updated : Apr 6, 2020, 4:28 PM IST

6 corona positive cases filed in Suryapet district

09:12 April 06

తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కొవిడ్​-19 లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలో నిర్ధరణ జరిగిందని ఆయన పేర్కొన్నారు.    

సూర్యాపేట పట్టణంలోని కుడకుడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి... తొలుత కరోనా నిర్ధరణ జరిగింది. ఆ తర్వాత ఆయన అత్తగారిల్లయిన వర్ధమానుకోటలోని ఆరుగురు కుటుంబ సభ్యులకు  కరోనా వైరస్​ సోకింది.

         కుడకుడ వాసి భార్య సహా ఆమె ఇద్దరు సోదరులు, వారి సతీమణులతోపాటు... తల్లి  కరోనా బారిన పడ్డారు.  ఆమె తనయుడు, తండ్రికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. వర్ధమానుకోటకు చెందిన కుటుంబ పెద్ద... మాంసం వ్యాపారి. ఈ మధ్యకాలంలో ఆయన 27 కుటుంబాలకు మాంసం అమ్మినట్లు గుర్తించిన అధికారులు... మెుత్తం 99 మందిని క్వారంటైన్​కు తరలించారు. మామ, అల్లుడు కలిసి దిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు  గుర్తించారు.

                మెుత్తంగా సూర్యాపేట జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 340కి చేరింది.  

Last Updated : Apr 6, 2020, 4:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.