సూర్యాపేట జిల్లా కేంద్రంలో నేటి నుంచి ఈనెల 25 వరకు 47వ జాతీయ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందుకు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వేదికైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడలను అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ క్రీడల ఏర్పాటుతో పట్టణం మొత్తం ఓ పండుగ వాతావరణం నెలకొంది.
జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు ఇప్పటికే సూర్యాపేటకు చేరుకున్నారు. జాతీయ క్రీడలకు తగిన వసతి కల్పించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ క్రీడల గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో జరుగుతున్నాయి. ఎండ వేడిమి దృష్ట్యా కబడ్డీ పోటీలను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నారు.
స్టేడియం తరహలో కుర్చీలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది వీక్షించేందుకు వీలు కల్పించారు. 65వ నంబర్ జాతీయ రహదారి క్రీడాకారులకు స్వాగత తోరణాలు వెలిశాయి. జాతీయ క్రీడలను విజయవంతం చేయాలని కోరుతూ సూర్యాపేట పట్టణంలో కళాకారులు, క్రీడాభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న క్రీడాకారులకు ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు ఇవ్వాల్సిన పురస్కారాలను ఇటీవల రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలసి మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల ఆవిష్కరించారు.
కరోనా నేపథ్యంలో క్రీడాకారులకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి పోటీకి అనుమతి ఇవ్వనున్నారు. క్రీడలను చూసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని నిర్వాహకులు సూచించారు.
- ఇదీ చదవండి : కోతుల బెడదుంది.. పట్టిస్తే తగ్గుతుంది