హుజూర్‌నగర్ బరిలో 251 మంది సర్పంచ్‌లు.. - హుజూర్ నగర్ ఉప ఎన్నిక
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ పెద్దసంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఆ పంథాలోనే సర్పంచ్‌లు వెళుతున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్‌లు నామనేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ బరిలో తెలంగాణ సర్పంచ్‌లు సంఘం అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్ వెల్లడించారు ఈ నెల 29, 30న 'హలో సర్పంచ్.. చలో హుజుర్‌నగర్' పేరుతో ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి దిగబోతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా... ఉప ఎన్నికల బరిలో మొత్తం 251మంది సర్పంచ్‌లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్కు పవర్‌ను రద్దుచేయాలని...73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను నేరుగా గ్రామపంచాయితీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెరాస అభ్యర్థిని ఓడించి సర్పంచుల సత్తా ఏమిటో చూపిస్తామని వెల్లడించారు.
ఇవీచూడండి: 'పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించండి'