సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కొమరబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడకు చెందిన ట్రాక్టర్ కొమరబండ వద్దకు రాగానే అదుపుతప్పి గొర్రెలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా... 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
గొర్రెల కాపరి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రెవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఒకేసారి 20 గొర్రెలు మృతి చెందడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి వాపోతున్నాడు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!