ETV Bharat / state

రోడ్డుపై వరినాట్లు వేసిన యువకులు

సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలో రోడ్డుపై వరినాట్లు వేసి యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ఇప్పటికైన రోడ్డును బాగుచేయించాలని కోరుతున్నారు.

author img

By

Published : Aug 8, 2019, 10:02 PM IST

వరినాట్లు వేసిన యువకులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దుంపలపల్లి గ్రామ యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వర్షాల వల్ల దుంపలపల్లి- చెల్లాపూర్ మధ్య ఉన్న రహదారిపై వరినాట్లు వేశారు. రోడ్డు చిత్తడిగా మారి గుంతలమయమైందని అధికారులకు మొర పెట్టుకున్నా స్పందించలేదని నిరసన వ్యక్తం చేశారు. రహదారి గుండా వెళ్లి ఇప్పటివరకు చాలా మంది గాయాలపాలయ్యారని యువకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని గ్రామస్థులు పేర్కొన్నారు.

వరినాట్లు వేసిన యువకులు

ఇదీ చూడండి : భానుపురి కుటుంబ సభ్యుల మధ్య వార్డుల చిచ్చు

Intro:దుబ్బాక మున్సిపాలిటీలో స్వచ్ఛ దుబ్బాక -హరితహారం కార్యక్రమం.

Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో స్వచ్ఛ దుబ్బాక స్వచ్ఛ దవాఖాన మరియు హరితహారం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ని బాత్రూం, మరియు ఆపరేషన్ థియేటర్ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో హరితహారం లో భాగంగా మొక్కలను నాటారు, ఇందులో భాగంగా ఆస్పత్రి సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ టీచర్లు మరియు దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొని చెట్లను నాటారు.

ఆస్పత్రిలో మొక్కలు నాటిన అనంతరం దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపాలిటీ కమీషనర్ నరసయ్య గారితో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పిలుపు మేరకు పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా ఈరోజు దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఆవరణను మొత్తం శుభ్రం చేశాము అని అలాగే మొక్కలు అనేవి మానవాళి జీవనానికి ప్రాణాధారం కావున వాటిని సంరక్షించ వలెనని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు, ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేది అని ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత అని అన్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమాలను కూడా కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు అని అన్నారు.

Conclusion:స్వచ్ఛ దుబ్బాక, స్వచ్ఛ దవాఖాన, హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే గారితో పాటు దుబ్బాక జడ్పిటిసి,ఎంపీపీ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నరసయ్య, దుబ్బాక ఎస్సై సుభాష్ గౌడ్ పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.