ETV Bharat / state

కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి - యూవీసీ వైరస్​ కిల్లర్​ రూపొందించిన భార్గవ్

కరోనా.. గత కొద్ది నెలలుగా ఆ పేరు వింటేనే వణుకొస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో చుట్టుముడుతుందో తెలీని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. బయట నుంచి తెచ్చే వస్తువులపైనా వైరస్​ ఉందనే భయం వెంటాడుతోంది. వీటిని నశింపజేయడమే లక్ష్యంగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థి భార్గవ్.. కేవలం రూ. 600 ఖర్చుతో యూవీసీ (అల్ట్రా వయోలెట్​ కంపైలర్​) వైరస్​ కిల్లర్​ను రూపొందించారు.

hyderabad cmr engineering student innocation
కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి
author img

By

Published : Sep 28, 2020, 1:44 PM IST

కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి

ప్రపంచవ్యాప్తంగా కలచివేస్తున్న కొవిడ్​ వైరస్​తో పాటు మరిన్ని రకాల వైరస్​ను నశింపజేసే పరికరాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కాపర్తి భార్గవ్​ కనుగొన్నారు. హైదరాబాద్​లోని సీఎంఆర్​ ఇంజినీరింగ్​ కళాశాలలో బీటెక్(ఇన్​ఫర్మేన్​ టెక్నాలజీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కరోనా వ్యాప్తి వల్ల ఆరు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులకు ఉపయోగపడే పరికరాన్ని రూపొందించాలని భావించారు.

వినియోగం..

అలా అనుకున్నదే తడవుగా 'యూవీసీ వైరస్‌ కిల్లర్' నమూనాను రూపొందించారు. కరోనాతో పాటు ఇతరత్రా వైరస్​లను నశింపజేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. యూవీ కిరణాలకు ఎలాంటి వైరస్​నైనా చంపే శక్తి ఉంటుందని... అయితే దీన్ని వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని భార్గవ్​ తెలిపారు.

తయారీ ఇలా..

కార్టన్‌ బాక్సు, రిఫ్లెక్షన్‌ కవర్‌, యూవీ బల్బు-1, కనెక్టర్‌, థర్మోకోల్స్​తో దీనిని తయారుచేశారు. మొదట అట్టపెట్టెలతో చతురస్రాకారంలో బాక్సును రూపొందించాలి. రిఫ్లెక్షన్‌ కవర్‌ను బాక్సు లోపల ప్యాక్‌ చేసి, పెట్టెలోపల థర్మోకోల్స్‌ ఉంచాలి. లోపలి భాగంలో యూవీసీ బల్బు అమర్చాలి. దీనికి కనెక్టింగ్‌ వైరు ఇస్తే పరికరం సిద్ధమవుతుంది. ఇక మనం తెచ్చే సామగ్రి ఏదైనా సరే అందులో ఐదు నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు పెట్టాల్సి ఉంటుంది.

ఇదీ చదవండిః వ్యాక్సిన్​ వచ్చే వరకూ.. ముందు జాగ్రత్తే మందు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.