ప్రజలు ఆరోగ్యంతో చేతినిండా పని ఉండి సుఖంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని హరీశ్‌రావు అన్నారు. అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేద్దామన్నారు. సమాజంలో మార్పు కోసం గ్రామాల్లో ఉదయం యోగ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. యోగ బాగా నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రపంచ యోగా దినోత్సవం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. యోగ వల్ల కలిగే ఉపయోగాలు పై పోటీలు నిర్వహించాలన్నారు. సమాజం మొత్తం యోగా వైపు మారేలా మార్పు తీసుకురావాలని ఉపాధ్యాయులకు వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
ఇదీ చూడండి:'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'