ETV Bharat / state

గొర్రెల మందపై తోడేళ్ల దాడి.. పది గొర్రెలు మృతి

గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేయడం వల్ల పది గొర్రెలు మృతి చెందగా.. మరో పది గొర్రెలు తీవ్ర గాయాల పాలైన ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన గొర్రెల విలువ లక్షా 50 వేల రూపాయల వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Wolf Attack On Sheeps In Siddipet District
గొర్రెల మందపై తోడేళ్ల దాడి.. పది గొర్రెలు మృతి
author img

By

Published : Jul 20, 2020, 11:01 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లి గ్రామానికి చెందిన కురుమ పోచయ్య అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో పది గొర్రెలు తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉన్నాయి. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు లక్షా 50 వేల రూపాయల వరకు ఉంటుందని బాధితుడు చెప్తున్నారు.

తన జీవనోపాధి అయిన గొర్రెలు మృతి చెందడం వల్ల తీవ్రంగా నష్టపోయానని.. ప్రభుత్వం ఆదుకొని సహాయం చేయాలని బాధితుడు కోరాడు. విషయం తెలుసుకున్న దుబ్బాక అటవీ శాఖ అధికారులు గొర్రెల కొట్టం వద్ద పత్తి చేనులో దాడి చేసిన జంతువు ఆనవాళ్లను పరిశీలించారు. కాలి గుర్తులను కొలిచి దాడి చేసింది.. తోడేళ్ళు కాకపోవచ్చని.. కుక్కలు దాడి చేసినట్టుగా భావిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : గవర్నర్​తో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.