సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంలోని సంతాన నాగ దేవత ఆలయం వద్ద శ్వేత నాగు కనిపించింది. ఆలయ ప్రహరీ నిర్మాణానికి ఉంచిన ఇటుకల వద్ద నాగు పాము సుమారు మూడు గంటల పాటు దర్శనమిచ్చిందని ఆలయ ధర్మకర్త భాస్కరరావు తెలిపారు.
సంతాన నాగ దేవత ఆలయం వద్ద నాగు పాము అరుదుగా కనిపిస్తుందని... గురువారం అమావాస్య పురస్కరించుకుని శ్వేత నాగు దర్శనం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఓరుగల్లులో వైభవంగా బతుకమ్మ వేడుకలు