కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram lift irrigation)లో భాగంగా నిర్మించిన జలాశయాల్లో అతిపెద్దదైన మల్లన్న సాగర్ రిజర్వాయర్(Mallanna Sagar reservoir)లోనికి నీటి పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ జలాశయ(Mallanna Sagar reservoir) కీలక పనులు పూర్తి చేసిన అధికారులు ఆగస్టు 22 నుంచి 28 వరకు ప్రయోగాత్మకంగా జలాశయం(Mallanna Sagar reservoir)లోకి గోదావరి నీటిని పంపింగ్ చేశారు. ఈ ఏడు రోజుల్లో 4.3 టీఎంసీల నీటిని నింపారు.
తిరిగి సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత పంపింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు జలాశయం(Mallanna Sagar reservoir)లో 11 టీఎంసీల నీరు పంపింగ్ చేయగా.. ప్రాజెక్టు పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలతో మరో టీఎంసీ నీరు జలాశయంలోకి చేరింది. ప్రస్తుతం మల్లన్నసాగర్(Mallanna Sagar reservoir)లో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లన్న సాగర్(Mallanna Sagar reservoir) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram lift irrigation)లో అతిపెద్ద జలాశయంగా నిలిచింది.