సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున గణపతి పూజ, విశేష పంచామృత అభిషేకాన్ని నిర్వహించి సరస్వతీ మాతగా అలంకరించారు.
ఆలయ పురవీధుల్లో సరస్వతి మాతను పల్లకిలో ఊరేగించారు. అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. అక్షర స్వీకారాలతో దేవాస్థాన ప్రాంగణం మారుమోగుతోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి సందర్భంగా వర్గల్ విద్యాధరి అమ్మవారిని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: కొండగట్టు అంజన్న దర్శనానికి బారులుతీరిన భక్తులు