భాను.. అభిజ్ఞ.. వీరిది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఐదేళ్ల క్రితం.. తండ్రి బొల్లు రాజయ్యని అనారోగ్యం మింగేసింది. కుటుంబానికి పెద్ద దిక్కయిన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంది రేణుక. కూలీనాలీ చేసి పిల్లలిద్దరినీ చదివిస్తూ.. పోషించుకునేది. కొన్నిరోజుల క్రితం రేణుక ఆరోగ్యం కూడా చెడిపోయింది. మంచానపడి అనారోగ్యంతో చనిపోయింది. తల్లి, తండ్రి ఇద్దరూ.. చనిపోవడంతో.. భాను, అభిజ్ఞలు అనాథలయ్యారు. పిల్లలిద్దరికీ అమ్మమ్మ ఉన్నప్పటికీ.. ఆమెకు వయసైపోయింది. అనారోగ్యంతో బాధపడుతోంది.
సాయం చేసే.. చేతుల కోసం..
పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకుని బడికి వెళ్తున్న ఆ పిల్లలను చూసి చుట్టుపక్కవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. ఆడుతూ.. పాడుతూ.. తల్లిదండ్రుల ఆలనా.. పాలనలో పెరగాల్సిన పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలిపోవడం.. చూసేవారి హృదయాలను కలచివేస్తుంది. తల్లిదండ్రులు లేక.. నా అనే దిక్కు లేక బిక్కటిల్లుతున్నారు. ఆదరించి.. అక్కున చేర్చుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు