ETV Bharat / state

Jawan Missing Case: జవాన్ సాయికిరణ్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్

Jawan Missing Case: పంజాబ్‌ సరిహద్దులో సైనికుడిగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జవాన్ అదృశ్యమైన రోజు నుంచి అతని ఖాతా నుంచి లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

jawan
సాయికిరణ్
author img

By

Published : Dec 15, 2021, 10:49 PM IST

Jawan Missing Case: అదృశ్యమైన జవాన్ బోకూరి సాయికిరణ్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతను అదృశ్యమైన తర్వాత అతడి బ్యాంకు ఖాతా నుంచి వివిధ ప్రదేశాల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సాయికిరణ్​రెడ్డి... మిస్సింగ్ కేసు విచారణ కోసం తెలంగాణ పోలీస్ అధికారులు బటిండా వెళ్లారు. బోకూరి సాయికిరణ్ రెడ్డి అదృశ్యమైన తర్వాత ఆయన ఖాతా నుంచి వివిధ ప్రాంతాల్లో లావాదేవీలు జరిగినట్లు ఏఎస్​ఐ కృష్ణమార్తి తెలిపారు. రోహ్​తక్, దిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం దిల్లీ వెళుతున్నట్లు వెల్లడించారు.

రైల్వేస్టేషన్, బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాలను వెతకగా... సాయికిరణ్ రెడ్డి డిసెంబర్ 6 ఉదయం 9.15 గంటలకు బటిండా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తూ కనిపించకుండా పోయారని పోలీస్ అధికారి వివరించారు. అతను ఫరీద్‌కోట్‌లో డ్యూటీకి వెళ్లలేదని.. తన కుటుంబానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల ఆందోళన..

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి పంజాబ్‌ సరిహద్దులో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఆయన సైన్యంలో చేరారు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చి.. ఈ నెల 5న పంజాబ్‌కు బయలుదేరివెళ్లారు.

కుటుంబ సభ్యులతో చివరిసారిగా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరవాత నుంచి చరవాణి స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. వారం రోజులుగా ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి వారు యత్నించి విఫలమయ్యారు. పంజాబ్‌లోని సైనిక అధికారులకు ఫోన్‌ చేస్తే.. విధుల్లో చేరలేదని చెప్పారని తల్లిదండ్రులు విజయ, పటేల్‌రెడ్డి వాపోతున్నారు. చేర్యాల పోలీస్‌ స్టేషన్‌లో సాయికిరణ్‌రెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. దిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ కేసు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Jawan Missing: జవాన్ మిస్సింగ్.. వారం నుంచి తెలియని ఆచూకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.