సిద్దిపేట బస్ డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్ష 31వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు దీక్ష కొనసాగిస్తామని, ప్రభుత్వం మొండి వైఖరి వదిలి కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని కార్మికులు కోరుతున్నారు.
ఉద్యోగులు ప్రాణత్యాగం చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మొండిగా ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః సత్తుపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు