దుబ్బాక ఉపఎన్నికల్లో డిపాజిట్ కోసమే కాంగ్రెస్ పోరాటమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మారడం ఎంత వరకు సమంజసమని హరీశ్ ప్రశ్నించారు.. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్‌రెడ్డి సహా సుమారు 50 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌తోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే పేదలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. ప్రజలంతా తెరాసకే ఓటు వేయాలని కోరారు.