పొలాల్లో మోటార్లకు మీటర్లని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం జలాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పద్మ అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి సుజాతతో కలిసి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారికి గ్రామ ప్రజలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే సుజాతని భారీ మెజార్టీతో గెలిపించాలని పద్మ కోరారు. ప్రచారం సమయంలో సుజాత ఉద్వేగానికి లోనయ్యారు.
రైతుల కోసం, ఆడపడుచుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని పద్మ అన్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే ప్రతి ఇంటికి తాగునీరు అందించామనీ, అతి త్వరలోనే ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, తెరాస ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ