తెలంగాణ 18వ ఆవిర్భావ దినోత్సవం సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసం దగ్గర్లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రన్ని సాధించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. సంక్షేమంలో, పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల, కార్యకర్తల సంక్షేమ కోరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్యకర్తల కృషి ఎంతో ఉందని హరీశ్ రావు హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు