సిద్దిపేట జిల్లా గౌరవెళ్లిలో తెలుగు వెలుగు సంస్థ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగి వందేళ్లు అయిన సందర్భంగా సంస్మరణ సమావేశాన్ని నిర్వహించారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన ప్రజలకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు చీకట్ల ముత్తయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సమావేశానికి తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకులు నాదమునుల రామారావు, విశ్రాంత ఉపాధ్యాయులు చిట్టి వేణుగోపాల్ రెడ్డి, గౌరవెల్లి సర్పంచ్, స్థానికులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: దిగ్గజాలు లేని పోరులో గెలుపు ఎవరిది?