సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలోని మిషన్ భగీరథ ట్యాంకులను తెలంగాణలో శిక్షణ పొందుతున్న 70 మంది ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ చేపట్టిన నిర్మాణాల గురించి మ్యాప్‌ల ద్వారా ఐఏఎస్ బృంద సభ్యులకు అధికారులు క్షుణ్ణంగా వివరించారు.
అద్భుతంగా ఉంది
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భగీరథ ట్యాంకుల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని శిక్షణా ఐఏఎస్ బృంద సభ్యులు తెలిపారు. ఇంజినీర్లు బాగా డిజైన్ చేశారని... ఇది పరిశీలించడం తమకు ఆనందంగా ఉందని అన్నారు.
ఇదీ చూడండి : లక్ష్మీనృసింహ.. హల్దీవాగు అభివృద్ధి ఏదీ..?