ETV Bharat / state

త్వరలోనే గజ్వేల్​కు రైలు సేవలు

త్వరలోనే గజ్వేల్​కు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అధికారులు రైలు ఇంజిన్​తో పట్టాలపై సన్నాహక పరుగులు నిర్వహించారు.

train trail run in siddipet district
త్వరలోనే గజ్వేల్​కు రైలు సేవలు
author img

By

Published : Jun 10, 2020, 10:28 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు త్వరలోనే రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైలు ఇంజిన్​తో మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైలు పట్టాలపై సన్నాహక పరుగులు నిర్వహించారు. కొన్నిరోజుల్లో గజ్వేల్​కు రైలు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు పనులు ముమ్మరం చేశారు.

పట్టాల బిగింపు, స్టేషన్ల నిర్మాణంతో పలు దఫాలుగా ఇంజిన్​తో సన్నాహక పరుగులు నిర్వహించారు. పూర్తిస్థాయి రైలుతో వేగంగా సన్నాహక పరుగులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కుదరకపోవడం వల్ల మరో రెండు రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సేఫ్టీ కమిషన్ తనిఖీ నిర్వహించిన కొన్ని రోజుల్లోనే గజ్వేల్​కు రైలు సేవలు ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: 'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.