సిద్దిపేట కోమటి చెరువు పరిసరాలు పర్యటకులతో సందడిగా మారాయి. కొత్త ఏడాది కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కోమటి చెరువు వద్దకు తరలివచ్చారు. సరదాగా ఆటపాటలతో సందడి చేశారు. బోటు విహారం చేసి ఆనందంలో మునిగితేలారు. చిన్నారులు అడ్వెంచర్ పార్క్లో సంతోషంగా ఆటలాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..