ETV Bharat / state

అనుబంధాలకు వారధి... ఆపదలో అవకాశమిది - eenadu editorials

ఉద్యమం సాగినన్నాళ్లూ ఊరించిన కల, నిజమై సిద్ధించిన రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్నేళ్లు! ఉద్యోగ జీవితం కాదు కాబట్టి... వారానికొకసారి సెలవన్న ఊసే లేదు!! 2001 నుంచి ఇప్పటిదాకా... కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. కారణాలేవైనా కుటుంబానికి, పిల్లలకు తగిన సమయం ఇవ్వలేకపోయా. అదుగో అలాంటి సమయంలో, ఆపదలో అవకాశం అంటారే... అలా ఇన్నేళ్లకు, దాదాపు 18-19 ఏళ్ల తరవాత మొట్టమొదటిసారి నాదైన సమయాన్ని గడిపే అవకాశం వచ్చింది. భార్యాబిడ్డలతో గడిపే అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు.

harish rao
harish rao
author img

By

Published : Mar 24, 2020, 7:57 AM IST

కరోనా వైరస్‌ కారణంగా- గడప దాటకుండా ఇంట్లో ఉండాల్సిన, అనివార్యంగా స్వీయ నిర్బంధంలో గడపాల్సిన అవసరం ఏర్పడింది. దీన్నొక శాపంగానో, బాధపడాల్సిన సమయంగానో భావించాల్సిన పని లేదు. ఒక అవకాశంగా తీసుకోవాలి. నిజానికి ఇది అత్యంత విలువైన సమయం. మనలోకి మనం చూసుకోవడానికి లభించిన గొప్ప అవకాశం. మనమే లోకంగా బతికే పిల్లలతో, జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడపడానికి దొరికిన అత్యంత విలువైన తరుణం. ఈ సమయాన్ని సంతోషకరంగా గడపండి. ఫోన్లలో నెట్‌ చూసుకుంటూనో, టీవీ చూసుకుంటూనో కాలాన్ని వృథాచేయొద్దు. పిల్లలతో మాట్లాడండి. పిల్లల ఆలోచనలేమిటో తెలుసుకోండి. వారి స్నేహితుల గురించి చెప్పమని అడగండి. మీ చిన్నప్పటి ఆటల గురించి, దోస్తుల గురించి వాళ్లకు చెప్పండి. పెరడు ఉంటే దగ్గరుండి వాళ్లతో మొక్కలు నాటించండి. లేకపోయినా ఫర్వాలేదు. బాల్కనీలో పూలకుండీల మధ్య వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి.

విలువైన తరుణమిది

సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం కన్నా, ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో ఎంత ఆనందం ఉందో వారికి నేర్పండి. ఇవన్నీ గొప్పగొప్ప పనులేం కావు. కానీ, ఒక్కోసారి చిన్నచిన్న పనులే గొప్ప ఆనందాన్నిస్తాయి. పిల్లల చిన్ని ప్రపంచంలో కొత్త వెలుగులు తెస్తాయి. పిల్లలతోపాటు, మీ జీవిత భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. పాత మధుర జ్ఞాపకాలను వెలికితీయండి. చిన్న చిన్న అరమరికలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి. ఆమె చేసే పనుల్లో పాలు పంచుకోండి. ఆమె కష్టాన్ని గుర్తించండి. ఆమె ఎలాంటి ఒత్తిడిలో ఉందో తెలుసుకోండి. అలా తెలుసుకున్నంత మాత్రాన వారి సమస్యలన్నీ తీరకపోవచ్చు. మీరు అర్జెంటుగా తీర్చేయలేకపోవచ్చు. కానీ ఓపిగ్గా, సహానుభూతితో వారు చెప్పేది వింటే చాలు... వారి కష్టాన్ని గుర్తిస్తే చాలు- వారి మనసులో భారాన్ని దించేసినట్టే! నిజానికివన్నీ ప్రతి ఒక్కరం బాధ్యతగా చేయాల్సిన పనులు. కానీ, పనిలో పడి మరచిపోయామంతే! ఫర్వాలేదు. బాకీలన్నీ తీర్చేసుకోవడానికి కావాల్సినంత అవకాశం లభించింది.

తల్లిదండ్రులకూ సమయం

భార్యాపిల్లలతోనే కాదు, అమ్మానాన్నలతోనూ మరింత నాణ్యమైన సమయం గడపడానికి ఇదొక గొప్ప అవకాశం. అంతేకాదు, ఇది వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం కూడా. పనుల ఒత్తిడిలో పడిపోయిన పిల్లల కడుపు చూసేది అమ్మానాన్నలే. వయోభారం వల్ల వచ్చే అనారోగ్యాలతో బాధపడుతున్న తల్లిదండ్రులకు మందులు తెచ్చి ఇవ్వడంతోనే మన బాధ్యత తీరిపోదు. ఆ సమస్యలను ఎదుర్కొనే మానసిక శక్తిని వారికి ఇవ్వగలిగేది మనమే. అందుకు మనం చేయాల్సిందల్లా, వారితో మనసు విప్పి మాట్లాడటమే. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ ఆనందమే వారికి ఆరోగ్యం. అన్ని ఆరోగ్యసమస్యలనూ ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చే శ్రీరామరక్ష.

అప్రమత్తత అవసరం

అంతేకాదు, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెద్దలను మరింత జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే, కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది పెద్దల్లోనే. ఇటలీలో ఇబ్బడిముబ్బడిగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నప్పుడు, ఆస్పత్రుల్లో కొంతమందినే చేర్చుకోగలిగే పరిస్థితిలో, 80 ఏళ్లు దాటిన వృద్ధులను చేర్చుకోకూడదనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. వైరస్‌ కారణంగా ఊపిరి పీల్చుకోలేని దుస్థితిలో, ఎనభై ఏళ్లు దాటినవాళ్లంతా ఆస్పత్రుల బయట ఎగశ్వాస పీలుస్తూ నరకయాతన పడుతున్న దృశ్యాలు ప్రపంచాన్నే కలచివేశాయి. అలాంటి దుస్థితి ఇక్కడ రాకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఈ ‘లాక్‌డౌన్‌’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘లాక్‌డౌన్‌’తో రోజువారీ రొటీన్‌కు భంగం కలిగి కొంత విసుగ్గా చిరాగ్గా అనిపించవచ్చు. కానీ, ఇది మన కోసమే... మనందరి మంచి కోసమే! మన పిల్లలు, మన పెద్దల మేలు కోసమే. నిజం చెప్పాలంటే... ఇదొక సువర్ణావకాశం.

వేడుకగా పుస్తక పఠనం

‘డిజిటల్‌ డీటాక్స్‌’ కావడంతోనే సరిపెట్టకుండా, మంచి పుస్తకాలు చదవండి. మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. పుస్తకాలు చదవడాన్ని మీ ఇంట్లోనే ఒక వేడుకగా మార్చేయండి. ఇంటిల్లపాదీ పుస్తక పఠనాన్ని కాలక్షేపంగా మార్చుకోండి. ఇదంతా మన మంచి కోసమే. మన ఆరోగ్యం కోసమే. ప్రభుత్వం విధించిన ‘లాక్‌డౌన్‌’ను శిక్షగా భావించొద్దు. మన ఆరోగ్యం కాపాడటం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి, సర్వశక్తులూ ఒడ్డి- కరోనాపై పోరు సాగిస్తున్నారు. మన కోసం పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందరం సహకరిద్దాం. ఈ చర్యల వెనక మీ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు ఇమిడి ఉన్నాయి. ఇలాంటి కష్టకాలంలో మనం చూపే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, మనకేం కాదనుకునే అతి విశ్వాసం- మన ప్రాణంతోపాటు మొత్తం సమాజాన్ని, దేశాన్నే ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. కరోనా చిన్న వైరస్సే కావచ్చు. కానీ, అది విసరుతున్న సవాలు ప్రపంచమంత పెద్దది. మనం పాటించే క్రమశిక్షణే దాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం. అంతకుమించిన మందు లేదు. అలా క్రమశిక్షణను పాటించడం ద్వారా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి. కరోనాను ఖతం చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుకోవాలి.

వదంతులూ వైరస్‌లాంటివే...

ఇది ఇంటర్‌నెట్‌ యుగం. వాట్సాప్‌ సందేశాలతో, ఫేస్‌బుక్‌ పోస్టులతో తెల్లవారే కాలం. కానీ ఈ టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. మంచికీ వాడొచ్చు, చెడుకీ వాడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ వల్ల జరుగుతున్న మంచి కన్నా చెడే ఎక్కువగా కనిపిస్తోంది. లేనిపోని వదంతులు, తప్పుడు ప్రచారాలు ఫోన్లలోకి, అక్కడి నుంచి మన మెదళ్లలోకి ‘డంప్‌’ అవుతున్నాయి. అన్నింటినీ నమ్మి భయాందోళనలకు గురికావద్దు. అలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మి, కనీసం ధ్రువీకరించుకునే ప్రయత్నమైనా చేయకుండా వేరొకరికి ‘ఫార్వర్డ్‌’ చేయొద్దు. అలా ‘ఫార్వర్డ్' చేయడం కూడా ఒక రకంగా వైరస్‌ వ్యాప్తి లాంటిదే. అసలు వైరస్‌ కన్నా వాటివల్లే ముప్పు ఎక్కువ. కాబట్టి, ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని తెలుసుకోండి. ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించండి. ఎవరికి వారు ఆ జాగ్రత్తలను పాటించడం మొదలుపెడితే చాలు- సమాజమంతా బాగుంటుంది. అంతేకాదు, వీలైనంతవరకు కొన్ని రోజులపాటు ‘డిజిటల్‌ డీటాక్స్‌’ కావడానికి ప్రయత్నించండి. ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో ఓటీటీ చానళ్లను చూడటం మొదలుపెడితే బ్రాడ్‌బ్యాండ్‌ సంక్షోభం ఎదురవుతుంది. ఫలితంగా, ఇళ్ల నుంచి పనిచేసేవారికి ఇంటర్‌నెట్‌ వేగం సరిపోని పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం మరింత ముదరక ముందే మేలుకొని, స్వచ్ఛందంగా ఇంటర్‌నెట్‌ వినియోగాన్ని పరిమితం చేసుకోవడం మనకే మంచిది. టీవీ, ఇంటర్‌నెట్‌ వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవడం వల్ల అమ్మానాన్నలతో, భార్యాపిల్లలతో మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే, ఇన్ని రోజులూ మనం మనవారికి సమయం ఇవ్వాలని మనసులో ఎంతగా ఉన్నా ఇవ్వలేకపోయాం. కొన్ని సందర్భాల్లో మనం సమయం ఇద్దామనుకున్నా- భార్యకు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లలకు చదువుల కారణంగా వారికి మనతో గడిపే సమయం దొరక్కపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేని విలువైన, నాణ్యమైన సమయం అందరికీ ఒకేసారి దొరికింది. కుటుంబానికి సంబంధించి మీరు గతంలో చేయాలనుకుని చేయలేకపోయిన చాలా పనులు చేయడానికి అందరికీ ఇది మంచి తరుణం. మించితే మళ్లీ దొరకదు.

-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.